Monday 2 April 2018

అందం

తరగని తడి అందాల తమకం.....
బంధనాలు తెంచుకుంటున్న బిగి సౌందర్యం....
తడి అద్దుకున్న కుంకుమ కాంతి కిరణం....
కాటుక కళ్ళు మాటున ఒదిగి పోయిన భావావేశం...
అదిరే అధరాల మౌనబాష్యం....
మోము పై కురుల విలాసం....
ఎదను ముద్దాడుతూ నాభి పై తుళ్ళిన తుంపరుల జలతార్లు....
ముంజేతులపై నీటి బిందువుల ముచ్చట్లు.....
నిలువెత్తు అందానికి నిదర్శనం తన రూపం......
తెలుస్తుంది..‌..ఆ నిలువెత్తు పొంకం నన్ను కోరుకుంటుందని.....
ఆ తమకం, ఆ బిగి, ఆ వంపు దగ్గరవుతున్నా.....
ఏదో తెలియని నిరాశక్తత... ఏదో తెలియని అయిష్టత....
దూరమయ్యాను.... ఇంకా దూరమవుతున్న సమయంలో.....
ధరి చేరి మనస్సు విప్పింది....
మనస్సు లో సుడులే వంపులు కన్నా ఆకర్షణ... తడిచిన అందాలని మించి నా హృదయాన్ని తాకిన తన మనస్సు లో హ్రద్యత....
మోము పై కురులను వెనక్కి తోస్తూ, అధరాల భాష్యం విన్నాక....
కలిగిన చెప్పలేని భావావేశం తరువాత అర్ధమయింది,
అందం అంటే మనస్సు అని,
ఇష్టం అంటే‌ మమత    అని...

Swati Mutthina Male Haniye .....

'You are strong' is her usual morning word on rounds with patients who are close to death. In the morning, if the patien...