Tuesday 13 February 2018

హృదయ సవ్వడి

సముద్ర తీరాన నడుస్తున్నాను, ఎంతో ప్రశాంతంగా....
ఎన్నెన్నో ఊహలు ,   ఎన్నెన్నో    కలలు......
దూరంగా ఊరించే సముద్రం, ఎన్నెన్నో  అలలు.....
హఠాత్తుగా ఒక గాలి దుమారం, ముంచెత్తిన అలలు...
ఎటు వెళుతున్నానో, ఏమి చేస్తున్నానో తెలియని అయేమయం...........
తేరుకున్న నేను తిరిగి చూస్తే చెదిరి‌ పోయిన కలలు.....
అయేమయం లో మళ్ళీ నడవడం మొదలుపెట్టా......
కాళ్ళు కూరుకుపోతున్నాయి ఇసుకలో....అలసిపోతునన్నాను....
వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటే జత అడుగు జాడలు
తెలియడం లేదు ఎందుకు నడుస్తున్నానో, నడుస్తూనే ఉన్నా....
కొన్ని అడుగులు నాతో కలిసి నడవాలని ప్రయత్నిస్తే
నా అడుగులు దూరంగా జరుగుతున్నాయి......
ఒంటరి అడుగులు అని జాలిపడి వచ్చిన
వేరే అడుగులకు పక్కన నడిచే చోటివ్వలేదు.....
కాని గాలి దుమారం లా ఉన్న ఒక అడుగుల సవ్వడి
నన్ను ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది....
ఆ శబ్దం నా హృదయాన్ని ఎక్కడో  మీటుతుంది.....
కలిసి నడవమని నా హృదయం గోల చేస్తుంది....
ఎన్నటికీ కలిసి నా అడుగులు తో అడుగులు వేయలేవు
అని చెప్పినా నా హృదయం ‌నా మాట వినడం లేదు...
కలిసి నడువు ..... ఇప్పటికైనా మగువ అవ్వమంటున్నాయి.....
తడబడుతున్నాయి అడుగులు... చెప్పిన మాట వినడం లేదు.....
జీవితంలో ఆనందం గా గడిపిన ఆ క్షణమైనా తరువాత
నీతో నడుస్తుంది, కలిసి నడువు అని ప్రోత్సాహిస్తుంది
ఎటువంటి బెరుకు లేని అడుగులు జత‌ కలుస్తూ ఉంటే నా అడుగులు లో ఏదో‌ బెరుకు...
స్పష్టత కలిగిన ఆ అడుగులు తో నా అడుగులు లో ఒక స్పష్టత.....
మూసుకున్న హృదయం తెరుచుకుంటుంటే అప్పుడు కనిపించాయి...
వెన్నెల ఆకాశం, చల్లని చందమామ....
ఇప్పుడు కలలు, అలలు కలిసి మెలిసి పాదాలను తుడుపుతున్నాయి........

No comments:

Swati Mutthina Male Haniye .....

'You are strong' is her usual morning word on rounds with patients who are close to death. In the morning, if the patien...